పార్వతీపురంలో ఉద్రిక్తం | high tension at parvathipuram | Sakshi
Sakshi News home page

పార్వతీపురంలో ఉద్రిక్తం

Oct 8 2016 11:50 AM | Updated on May 28 2018 3:04 PM

విజయనగరం జిల్లా పార్వతీపురంలో అగ్రిగోల్డ్ బాధితుల ఆందోళన ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది.

విజయనగరం : విజయనగరం జిల్లా పార్వతీపురంలో అగ్రిగోల్డ్ బాధితుల ఆందోళన ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. శనివారం ఉదయం సుమారు వెయ్యి మంది బాధితులు, ఏజెంట్లు పట్టణంలోని ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించేందుకు ప్రయత్నించారు. ఆ ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు.

ఈ క్రమంలో అగ్రిగోల్డ్ బాధితులకు పోలీసులు మధ్య తోపులాటతోపాటు వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో సుమారు 50 మంది అగ్రిగోల్డ్ బాధితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పోలీస్స్టేషన్కు తరలించారు. దీంతో మిగిలిన బాధితులు రహదారిపై బైఠాయించి... ర్యాలీ నిర్వహించి తీరుతామని పేర్కొన్నారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
 

Advertisement
 
Advertisement
Advertisement