త్రిపురాంతకం ఆలయంలో హైకోర్టు న్యాయమూర్తి ప్రత్యేక పూజలు చేశారు.
త్రిపురాంతకంలో హైకోర్టు జడ్జి పూజలు
Oct 3 2016 8:03 PM | Updated on Sep 4 2017 4:02 PM
ప్రకాశం : హైకోర్టు న్యాయమూర్తి బి.శివశంకరరావు సోమవారం కుటుంబసభ్యులతో కలిసి త్రిపురాంతకంలోని శ్రీబాలాత్రిపురసుందరీదేవి ఆలయానికి విచ్చేశారు. వీరికి ఆలయం వద్ద వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారి ఆలయంలో కుంకుమార్చనలు, శ్రీ పార్వతి సమేత త్రిపురాంతకేశ్వరస్వామివారి ఆలయంలో అభిషేకాలు చేశారు. అనంతరం ఆనంద నిలయం వద్ద జరుగుతున్న సహస్ర చండీయాగంలో న్యాయమూర్తి పాల్గొన్నారు.
Advertisement
Advertisement