ఎయిర్పోర్ట్లో 120 సవర్ల బంగారం స్వాధీనం | Gold worth Rs. 30 lakhs seized at chennai airport | Sakshi
Sakshi News home page

ఎయిర్పోర్ట్లో 120 సవర్ల బంగారం స్వాధీనం

Jul 13 2014 11:03 AM | Updated on Sep 2 2017 10:15 AM

ఎయిర్పోర్ట్లో 120 సవర్ల బంగారం స్వాధీనం

ఎయిర్పోర్ట్లో 120 సవర్ల బంగారం స్వాధీనం

బ్యాంకాక్ నుంచి అనుమతి లేకుండా తీసుకువచ్చిన 120 సవర్ల బంగారు నగలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

బ్యాంకాక్ నుంచి అనుమతి లేకుండా తీసుకువచ్చిన 120 సవర్ల బంగారు నగలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఒక మహిళ వద్ద విచారణ జరుపుతున్నారు. బ్యాంకాక్ నుంచి థాయ్ ఎయిర్‌లైన్స్ విమానం శనివారం తెల్లవారుజామున 1.30 గంటలకు చెన్నై చేరుకుంది. అందులోని ప్రయాణికుల వద్ద కస్టమ్స్ అధికారులు తనిఖీలు జరిపారు.

 

మియన్మార్‌కు చెందిన రెజినా మరియం (44) అనే మహిళ టూరిస్టు వద్ద తనిఖీ చేయగా ఆమె వద్ద 120 సవర్ల కొత్త బంగారు నగలున్నట్టు గుర్తించారు. వీటి విలువ రూ. 30 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. నగలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మహిళను విచారిస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement