భారీ వర్షాల నేపథ్యంలో పాఠశాలలకు శుక్రవారం సెలవు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
భారీ వర్షాల నేపథ్యంలో పాఠశాలలకు శుక్రవారం సెలవు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా కలెక్టరేట్‌తో పాటు జిల్లాలోని 5 రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ తెలిపారు. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో పాటు మండల, గ్రామస్థాయి అధికారులు స్థానికంగా అందుబాటులో ఉండి అప్పటికప్పుడు పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు.