కారులో బయటపడ్డ రూ.2.5కోట్లు నగదు | Former judge's son caught with Rs 2 crore cash at Vidhana Soudha | Sakshi
Sakshi News home page

కారులో బయటపడ్డ రూ.2.5కోట్లు నగదు

Oct 22 2016 9:42 AM | Updated on Aug 21 2018 5:54 PM

కారులో బయటపడ్డ రూ.2.5కోట్లు నగదు - Sakshi

కారులో బయటపడ్డ రూ.2.5కోట్లు నగదు

కర్ణాటక విధాన సౌధ ఆవరణలోని అనుమానాస్పదంగా ప్రవేశిస్తున్న కారు నుంచి రూ.2.5కోట్లు బయటపడ్డాయి.

బెంగళూరు : కర్ణాటక విధాన సౌధ ఆవరణలోని అనుమానాస్పదంగా ప్రవేశిస్తున్న కారు నుంచి రూ.2.5కోట్లు బయటపడ్డాయి. శుక్రవారం మధ్యాహ్నం కెంగెల్ హనుమంతయ్య ముఖద్వారం మీదగా విధాన సౌధలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తోన్న కేఏ04 ఎంఎం9018 నంబర్ వోక్స్ వ్యాగన్ కారును పోలీసులు తనిఖీ చేశారు. వారి సోదాల్లో మూడు పెట్టెల్లో సర్ధిపెట్టిన ఈ నగదు లభించింది. వాహన యజమాని ధార్వాడకు చెందిన న్యాయవాది, మాజీ జడ్జి కుమారుడు సిద్ధార్థ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టెండర్కు సంబంధించి ఓ మంత్రికి ఇవ్వడానికి ఈ డబ్బు తరలిస్తున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ సందర్భంగా సెంట్రల్ డీసీపీ సందీప్ పాటిల్ మాట్లాడుతూ కారులో నుంచి రూ.1.97 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి సిద్ధార్థను విచారణ చేస్తున్నట్లు చెప్పారు. పెద్ద మొత్తంలో లభ్యమైన నగదుకు సంబంధించి ఎలాంటి పత్రాలు లేవన్నారు. అయితే పొంతనలేని సమాధానాలతో పాటు, స్థలం రిజిస్ట్రేషన్ కోసం ఆ నగదును తన వద్ద ఉంచుకున్నట్లు, అందుకు సంబంధించి పత్రాలు సమర్పించేందుకు తనకు కొంత సమయం కావాలని సిద్ధార్ధ కోరటం కొసమెరుపు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement