గుంటూరు జిల్లా బెల్లంకొండలో జరిగిన అగ్ని ప్రమాదంలో సినిమాహాల్ కాలిపోయింది.
థియేటర్ లో అగ్ని ప్రమాదం
Dec 26 2016 10:54 AM | Updated on Sep 5 2018 9:47 PM
బెల్లంకొండ: గుంటూరు జిల్లా బెల్లంకొండలో జరిగిన అగ్ని ప్రమాదంలో సినిమాహాల్ కాలిపోయింది. స్థానిక ప్రధాన సెంటర్‌లో ఉన్న గణేష్ టాకీస్ గత పదేళ్లుగా మూతబడి ఉంది. సోమవారం ఉదయం టాకీస్ పక్కనే ఉన్న చెత్తకుప్పకు నిప్పు అంటుకోవడంతో ఆ మంటలు వ్యాపించి సినిమా హాల్‌కు అంటుకున్నాయి. ఫర్నిచర్ సహా చాలా భాగం కాలిపోయింది. సుమారు రూ. 5 లక్షల నష్టం వాటిల్లిందని యజమాని అంటున్నారు. సమాచారం అందించినా ఫైరింజన్ రాకపోవటంతో మంటలను స్థానికులే ఆర్పి వేస్తున్నారు.
Advertisement
Advertisement