మర్రిగూడెంలో పోడు రైతు ఆత్మహత్య | farmer committed suicide | Sakshi
Sakshi News home page

మర్రిగూడెంలో పోడు రైతు ఆత్మహత్య

Aug 16 2016 7:40 PM | Updated on Oct 1 2018 2:36 PM

ఖమ్మం జిల్లా చండ్రుగొండ మండలం మర్రిగూడెంకు చెందిన పోడు రైతు మడకం వెంకటేశ్వర్లు(30) మంగళవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

-పంట నాశనం చేశారని మనస్తాపం?
చండ్రుగొండ

 ఖమ్మం జిల్లా చండ్రుగొండ మండలం మర్రిగూడెంకు చెందిన పోడు రైతు మడకం వెంకటేశ్వర్లు(30) మంగళవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వెంకటేశ్వర్లు తనకున్న ఐదెకరాల పోడుభూమిలో పత్తి సాగు చేస్తున్నాడు. దీని కోసం రూ.లక్ష వరకు అప్పుచేసి పెట్టుబడి పెట్టాడు. ఇటీవల అటవీశాఖ అధికారులు ఆ పంటను నాశనం చేయడంతో మనస్తాపం చెంది ఇంటి వెనుక భాగంలో కండువతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వెంకటేశ్వర్లు ఉరివేసుకున్న తీరు అనుమానాస్పందంగా ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే, వెంకటేశ్వర్లు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోలేదని ఏఎస్సై హుస్సేన్ అంటున్నారు. అతను గుంటూరు జిల్లాలో పని చేసుకుంటున్నాడని, వెంకటేశ్వరుల సోదరుడు శ్రీను ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని, కర్మకాండల కోసం వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడని వివరించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement