ఫేస్‌బుక్‌లో ప్రేమాయణం | facebook love | Sakshi
Sakshi News home page

ఫేస్‌బుక్‌లో ప్రేమాయణం

Aug 21 2016 2:31 AM | Updated on Jul 26 2018 5:23 PM

ఫేస్‌బుక్‌లో ప్రేమాయణం - Sakshi

ఫేస్‌బుక్‌లో ప్రేమాయణం

కాల్‌సెంటర్ ఉద్యోగిని, సైనికుడి మధ్య ఫేస్‌బుక్‌లో మొదలైన ప్రేమాయణం చివరకు పోలీస్‌స్టేషన్‌కు చేరింది.

{పియుడితో వివాహం జరిపించాలని
పోలీసులను ఆశ్రయించిన యువతి


గంగావతి (కర్ణాటక) : కాల్‌సెంటర్ ఉద్యోగిని, సైనికుడి మధ్య ఫేస్‌బుక్‌లో మొదలైన ప్రేమాయణం చివరకు పోలీస్‌స్టేషన్‌కు చేరింది. వివరాలిలా ఉన్నాయి. బెంగళూరులోని ఓ కాల్ సెంటర్‌లో పనిచేస్తున్న మైసూరుకు చెందిన శ్వేత, ఛత్తీస్‌ఘడ్‌లోని రాయపూర్‌లో సైన్యంలో పనిచేస్తున్న కర్ణాటకలోని కొప్పళ జిల్లా యలబుర్గ తాలూకా, ముట్టాళ్ గ్రామానికి చెందిన వీరేష్ ఫేస్‌బుక్‌లో పరిచయమయ్యారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది.

కొంతకాలంగా  వీరేష్ నుంచి ఎలాంటి సమాచారమూ అందలేదు. దీంతో శ్వేత.. వీరేష్ ఆచూకీ తెలుసుకొని శుక్రవారం కుక్కనూరు పోలీసు స్టేషన్‌కు వచ్చింది. వీరేష్, తాను ప్రేమించుకున్నామని, తమకు వివాహం చేయాలని పోలీసులను కోరింది. పోలీసులు వీరేష్‌తో పాటు అతని కుటుంబ సభ్యులను పిలిపించి విచారణ చేశారు. మూడు నెలలు సమయమిస్తే తాను శ్వేతను వివాహం చేసుకుంటానని వీరేష్ చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement