
మాజీ ఎమ్మెల్యేపై ‘బుల్లెట్’ దాడి
నేషనల్ లోక్ దళ్ (ఐఎన్‌ఎల్‌డీ) మాజీ ఎమ్మెల్యే భరత్‌సింగ్, ఆయన ఇద్దరు అనుచరులపై దుండగులు ఆదివారం
న్యూఢిల్లీ: నేషనల్ లోక్ దళ్ (ఐఎన్‌ఎల్‌డీ) మాజీ ఎమ్మెల్యే భరత్‌సింగ్, ఆయన ఇద్దరు అనుచరులపై దుండగులు ఆదివారం కాల్పులు జరిపారు. ముగ్గురిని గుర్గావ్‌లోని మేదాంతా ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. సీనియర్ పోలీస్ అధికారి తెలిపిన వివరాలు.. దక్షిణ ఢిల్లీలోని రఘునందన్ వాటికలో ఒక ప్రైవేటు ఫంక్షన్‌కు భరత్‌సింగ్ తన ఇద్దరు వ్యక్తిగత రక్షకులతో హాజరయ్యారు. ఆ సమయంలో దుండగులు వారిపై కాల్పులు జరపగా భరత్‌సింగ్ తలలో బుల్లెట్ దిగింది. 2012లోనూ ఆయనపై కాల్పులు జరగగా ప్రస్తుతం బుల్లెట్ గాయమైనచోటే అప్పుడు కూడా గాయమైంది. ఆనాటి కేసులో నలుగురిని ఆరెస్టు చేశారు.