త్వరలో పెళ్లిపీటలెక్కాల్సిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన శనివారం అర్ధరాత్రి జిల్లాలోని మద్దూరు తాలూకాలో జరిగింది.
మండ్య(బెంగళూరు): త్వరలో పెళ్లిపీటలెక్కాల్సిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన శనివారం అర్ధరాత్రి జిల్లాలోని మద్దూరు తాలూకాలో జరిగింది. తాలూకాలోని మరళిగ గ్రామానికి చెందిన మల్లేశ్‌గౌడ(30)కు ఇదే ఏడాది జూన్ నెలలో మండ్యకు చెందిన యువతితో నిశ్చితార్థం జరిగింది. డిసెంబర్‌లో వీరి వివాహం జరగాల్సి ఉంది. అయితే మల్లేశగౌడ శనివారం రాత్రి ఇంట్లోనే విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
తనతో నిశ్చితార్థమైన యువతి, ఆమె స్నేహితులే తన ఆత్మహత్యకు కారణమని మల్లేశగౌడ సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేసినట్లు ఆనవాళ్లు లభ్యమయ్యాయి. మల్లేశగౌడ తల్లితండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.