విజయకాంత్‌కి ఆహ్వానం | DMK Chief Karunanidhi invites Vijayakanth for DMK Alliance | Sakshi
Sakshi News home page

విజయకాంత్‌కి ఆహ్వానం

Dec 24 2015 9:01 AM | Updated on Sep 3 2017 2:31 PM

డీఎంకేతో దోస్తికి ముందుకు రావాలని డీఎండీకే అధినేత విజయకాంత్‌కు ఆ పార్టీ అధినేత ఎం కరుణానిధి స్వయంగా ఆహ్వానం పలికారు.

విజయకాంత్‌కు కరుణ ఆహ్వానం
ఎన్నికల మేనిఫెస్టో కసరత్తు
 
చెన్నై : డీఎంకేతో దోస్తికి ముందుకు రావాలని డీఎండీకే అధినేత విజయకాంత్‌కు ఆ పార్టీ అధినేత ఎం కరుణానిధి స్వయంగా ఆహ్వానం పలికారు. ఎన్నికల మేనిఫెస్టో కసరత్తుకు డీఎంకే శ్రీకారం చుట్టింది.  డీఎండీకేను తమ వైపునకు తిప్పుకునేందుకు డీఎంకే విశ్వ ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, విజయకాంత్ వారికి చిక్కకుండా ముందుకు సాగుతున్నారు.

ఇన్నాళ్లు డీఎంకే దూతలు విజయకాంత్‌తో మంతనాలు సాగిస్తే, తాజాగా ప్రజా కూటమి రంగంలోకి దిగడంతో డీఎంకే అధినేత ఎం కరుణానిధి సైతం మెట్టుదిగినట్టు ఉన్నారు. విజయకాంత్‌కు స్వయంగా కరుణానిధి ఆహ్వానం పలకడం విశేషం. బుధవారం డీఎంకే కార్యాలయం అన్నా అరివాలయంలో ఎన్నికల మేనిఫెస్టో కసరత్తులకు కరుణానిధి శ్రీకారం చుట్టారు.

మేనిఫెస్టో కమిటీతో భేటీ అయ్యారు. తదుపరి మీడియా ముందుకు వచ్చిన కరుణానిధి విజయకాంత్‌కు ఆహ్వానం పలికారు. డీఎంకేతో దోస్తికి విజయకాంత్ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రజా కూటమి నాయకులు డీఎండీకే అధినేత విజయకాంత్‌తో భేటీ కావడం గురించి ప్రశ్నించగా, సమాధానం ఇవ్వడానికి నిరాకరించారు.

Advertisement
 
Advertisement
Advertisement