అన్ననుక్కు జై కొట్టిన మహిమ | Dhanush's Annanukku Jai Mahima to play female lead role | Sakshi
Sakshi News home page

అన్ననుక్కు జై కొట్టిన మహిమ

Jan 26 2015 4:23 AM | Updated on Sep 2 2017 8:15 PM

అన్ననుక్కు జై కొట్టిన మహిమ

అన్ననుక్కు జై కొట్టిన మహిమ

వర్ధమాన నటి మహిమ అవకాశాలు పెంచుకుంటోంది. సాటై చిత్రంతో కోలీవుడ్‌లో అడుగిడిన ఈ కేరళ కుట్టి తొలి చిత్రంలోనే

 వర్ధమాన నటి మహిమ అవకాశాలు పెంచుకుంటోంది. సాటై చిత్రంతో కోలీవుడ్‌లో అడుగిడిన ఈ కేరళ కుట్టి తొలి చిత్రంలోనే నటనాపరంగా మంచి మార్కులు కొట్టేసింది. ఆ మధ్య నటించిన ఎన్నమో నడక్కుదు చిత్రం ఈమె ఖాతాలో మంచి విజయవంతమైన చిత్రంగా నిలిచింది. ప్రస్తుతం 150 సీసీ చిత్రంతో పాటు సముద్రకని దర్శకత్వంలో కిట్కా చిత్రంలో నటిస్తోంది. నటి అమలాపాల్ నటించాల్సిన ఈ చిత్రంలో ఆమె వివాహం చేసుకోవడంతో మహిమను ఈ అవకాశం వరిచింది. విశేషం ఏమిటంటే కిట్కా చిత్రంలో మహిమ తొలిసారిగా నాగరిక యువతి, కొండ ప్రాంత అమ్మాయి అంటూ రెండు వైవిధ్యభరిత పాత్రల్ని పోషించనుంది.
 
 తాజాగా యువ నటుడు అట్టకట్టై దినేష్ సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది. మరో విశేషం ఏమిటంటే ఈ చిత్రాన్ని దర్శకుడు వెట్రిమారన్, నటుడు ధనుష్ కలిసి నిర్మిస్తున్నారు. వెట్రిమారన్ శిష్యుడు రాజ్‌కుమార్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. చిత్రానికి అన్ననుక్కు జై అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఇదే పేరుతో చాలా కాలం క్రితం నటుడు అర్జున్ నటించిన చిత్రం తెరపైకి వచ్చింది. దినేష్ ప్రతిమల అన్ననుక్కు జై చిత్రం షూటింగ్ వేగంగా జరుపుకుంటోంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement