విధానసభ ఎన్నికల్లో తమ పార్టీ గె లిచితీరుతుందని బీజేపీ నాయకుడు, కేంద్ర మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ధీమా వ్యక్తం చేశారు. తన తల్లిని వెంటబెట్టుకొచ్చిన వర్ధన్
న్యూఢిల్లీ : విధానసభ ఎన్నికల్లో తమ పార్టీ గె లిచితీరుతుందని బీజేపీ నాయకుడు, కేంద్ర మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ధీమా వ్యక్తం చేశారు. తన తల్లిని వెంటబెట్టుకొచ్చిన వర్ధన్ ...కృష్ణనగర్ నియోజకవర్గంలో ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈసారి తమ విజయం చారిత్రాత్మకమవుతుందన్నారు. సర్వేల్లో మీ పార్టీ కంటే ఆప్ ముందుంది కదా అని మీడియా అడగ్గా అందుకు స్పందిస్తూ...‘అది మాకు వాస్తవంగా ఎక్కడా కనిపించలేదు. మా పార్టీ విజయం సాధిస్తుందనే విషయంలో నాకు నూటికి నూరు శాతం ధీమా వఉంది. ఫలితాలొచ్చేంతవరకూ పోల్ సర్వేలపై మాట్లాడదలుచుకోలేదు’అని అన్నారు. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్‌కు ప్రత్యర్థిగా పోటీచేసిన నూపుర్‌శర్మ మాట్లాడుతూ విధానసభ ఎన్నికల్లో విజయం తమదేనన్నారు.