డిగ్రీ విద్యార్థిని అనుమానాస్పద మృతి | degree student suspicious death in warangal district | Sakshi
Sakshi News home page

డిగ్రీ విద్యార్థిని అనుమానాస్పద మృతి

Dec 28 2016 12:44 PM | Updated on Sep 28 2018 3:41 PM

గొర్రెలకు కాపలాగా వెళ్లిన ఓ డిగ్రీ విద్యార్థిని బావిలో శవమై కనిపించింది.

తొర్రూర్: గొర్రెలకు కాపలాగా వెళ్లిన ఓ డిగ్రీ విద్యార్థిని బావిలో శవమై కనిపించింది. వరంగల్ జిల్లా తొర్రూర్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. స్థానికంగా ఉండే తెల్లగొల్ల బిక్షపతికి గొర్రెల పెంపకందారు. ఆయన కుమార్తె ఉమ(20) డిగ్రీ సెకండియర్ చదువుకుంటోంది. మంగళవారం తండ్రి వేరే పనినిమిత్తం ఊరెళ్లటంతో ఉమ గ్రామం శివారుల్లో గొర్రెలను మేపేందుకు వెళ్లింది. అయితే, సాయంత్రం సమయానికి గొర్రెలు ఇంటికి చేరుకున్నా ఉమ రాలేదు.
 
దీంతో కుటుంబసభ్యులు స్థానికంగా వెదికినా ఫలితం కనిపించలేదు. బుధవారం ఉదయం సమీపంలోని బావి గట్టున ఆమె చెప్పులు, టవల్ కనిపించటంతో గాలించగా శవం లభ్యమైంది. ఉమ ఆత్మహత్య చేసుకుందా లేక ప్రమాదవశాత్తు బావిలో పడి చనిపోయిందా అన్నది తేలాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు స్థానికులు, కుటుంబసభ్యుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement