సార్‌.. చేపలు కొనిపెట్టరూ..!

Coronavirus lockdown: Chennai Cop offer fish for Old Woman - Sakshi

సాక్షి, చెన్నై: లాక్‌డౌన్‌ సమయంలో ఓ వృద్ధురాలు అమాయకంగా అడిగిన కోరికను ఓ పోలీస్‌ అధికారి వెంటనే నెరవేర్చారు. ఈ ఘటన కన్యాకుమారి జిల్లా, కుళచ్చల్‌లో చోటుచేసుకుంది. కన్యాకుమారి జిల్లాలో లాక్‌డౌన్‌ కారణంగా తీర ప్రాంతంలో చేపల వేటపై నిషేధం ఉంది. కాగా కుళచ్చల్‌ ఏఎస్పీ విశ్వేష్‌శాస్త్రి కరోనా నివారణ విధుల్లో ఉన్నారు. అనాథలు, పేదలు, సామాన్య ప్రజలకు పోలీసుల తరఫున కూరగాయలు, బియ్యం అందజేసేందుకు ఏర్పాట్లు చేశారు. కుళచ్చల్‌ టీఎంసీ కాలనీ ప్రాంతంలో ఉన్న వృద్ధులు సహా పలువురికి కూరగాయలు, బియ్యం వంటివి అందజేస్తూ వచ్చారు. (చెన్నైలో భయం.. భయం)

ఆయన శుక్రవారం ఆ ప్రాంతంలో మళ్లీ విధుల్లో నిమగ్నమయ్యారు. ఆ సమయంలో ఒక ఇంటి అరుగుపై దిగాలుగా కూర్చున్న వృద్ధురాలిని గమనించాడు. ఏమైనా సాయం కావాలా? అని ప్రశ్నించాడు. అందుకు వృద్ధురాలు అయ్యా! లాక్‌డౌన్‌ ఉంది కదా, అందుకే  చేపలు తిని చాలా రోజులయ్యింది, కొంచెం చేపలు కొనివ్వండని అమాయకంగా అడగటంతో  ఏఎస్పీ వెంటనే స్పందించారు. చేపలు కొనుక్కోని రావాలని ఆయన తన సిబ్బందిని ఆదేశించారు. కుళచ్చల్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ రాధాకృష్ణన్, ఏఎస్‌ఐ అలెక్స్‌ హార్బర్‌కు వెళ్లి చేపలు కొనుగోలు చేసి వృద్ధురాలికివ్వడంతో స్థానికులు వారిని ప్రశంసలతో ముంచెత్తారు. (పోలీసులపై దాష్టీకాలా?)

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top