'ఉద్యోగులను పర్మినెంట్ చేయడం కుదరదు' | contract employees permanent not possible says by ap minister yanamala ramakrishnudu | Sakshi
Sakshi News home page

'ఉద్యోగులను పర్మినెంట్ చేయడం కుదరదు'

Nov 26 2016 3:50 PM | Updated on Aug 27 2018 8:44 PM

'ఉద్యోగులను పర్మినెంట్ చేయడం కుదరదు' - Sakshi

'ఉద్యోగులను పర్మినెంట్ చేయడం కుదరదు'

కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేసే అవకాశం లేదని యనమల తేల‍్చి చెప్పారు.

గుంటూరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా తీవ్ర ఇబ‍్బందుల్లో ఉందని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. శనివారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే రూ.9 నుంచి 10 వేల కోట్ల లోటు బడ్జెట్లో ఉందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరాంతానికి లోటు బడ్జెట్ రూ.24 వేల కోట్లకు చేరే అవకాశముందన్నారు.

కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేసే అవకాశం లేదని ఆయన తేల‍్చి చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు కూడా అందుకు అడ్డుగా ఉందన్నారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపర్చేందుకు ఉద్యోగులు కృషి చేయాలని యనమల అన్నారు. మంత్రి తాజా వ్యాఖ్యలతో కాంట్రాక్టు ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లినట్లు అయ్యింది.

Advertisement
 
Advertisement
Advertisement