సీఎం బందోబస్తులో అపశృతి | constable pistol misfire in cm chandrababu tour | Sakshi
Sakshi News home page

సీఎం బందోబస్తులో అపశృతి

Jan 2 2017 3:51 PM | Updated on Aug 14 2018 11:26 AM

సీఎం బందోబస్తులో అపశృతి - Sakshi

సీఎం బందోబస్తులో అపశృతి

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడి బందోబస్తులో అపశృతి చోటుచేసుకుంది.

కల్లూరు: ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడి బందోబస్తులో అపశృతి చోటుచేసుకుంది. కర్నూలు జిల్లా కల్లూరు మండలం తడకనపల్లె గ్రామం వామసముద్రం కొండల్లో బందోబస్తు నిర్వహిస్తున్న ఏపీఎస్‌పీ కానిస్టేబుల్ అంబన్న తుపాకీ మిస్‌ఫైర్ అయింది. దీంతో బుల్లెట్ ఆయన ఛాతీలోకి దూసుకెళ్లింది. తీవ్రంగా రక్తస్రావం అవటంతో హుటాహుటిన కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడిన కానిస్టేబుల్ అంబన్న అనంతపురం బెటాలియన్‌కు చెందిన వ్యక్తి. ఈ ఘటనపై పోలీసు అధికారులు విచారణ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement