పళ్లిపట్టు, న్యూస్‌లైన్: లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే, కాంగ్రెస్ పార్టీలకు ప్రజలు గుణపాఠం చెప్పాలని అన్నాడీఎంకే నాయకుడు నరసింహన్ ప్రజలకు పిలుపు నిచ్చారు.
కాంగ్రెస్ డీఎంకేలకు గుణపాఠం చెప్పాలి
Oct 21 2013 7:10 AM | Updated on Sep 1 2017 11:50 PM
పళ్లిపట్టు, న్యూస్‌లైన్: లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే, కాంగ్రెస్ పార్టీలకు ప్రజలు గుణపాఠం చెప్పాలని అన్నాడీఎంకే నాయకుడు నరసింహన్ ప్రజలకు పిలుపు నిచ్చారు. అన్నాడీఎంకే 42 వ ఆవిర్భావ వేడుకలు సందర్భంగా ఆర్‌కే.పేటలో శనివారం రాత్రి బహింరగ సభ నిర్వహించారు. సెరత్తూర్‌లో నిర్వహించిన సభకు ఆ పార్టీ యూనియన్ వ్యవసాయ విభాగం అదనపు కార్యదర్శి నారాయనన్ అధ్యక్షత వహించారు. గ్రామ కార్యదర్శి బాలయ్యన్ స్వాగతోపన్యాసం చేశారు. ముఖ్య అతిథిగా నరసింహన్ పాల్గొని ప్రసంగించారు. ప్రజల దీవెనలతో మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఎన్నికై సుపరిపాలన చేసిన ఎంజీఆర్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు.
ఎంజీఆర్ స్థాపించిన అన్నాడీఎంకేకు నేడు 42 వసంతంలోకి ప్రవేశించిందన్నారు. ఎంజీఆర్ బాటలో ముఖ్యమంత్రి జయలలిత పయనిస్తూ పేదలు, అణగారిన వర్గాల ప్రజల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేస్తున్నట్లు తెలిపారు. శ్రీలంకలో లక్షలాది తమిళులు హత్యకు సూత్రధారి కాంగ్రెస్ పార్టీ అని, వారికి తొత్తుగా డీఎంకే వ్యవహరించింది విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలను ప్రజలు గుణపాఠం నేర్పాలని కోరారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు మూర్తి, బలరామన్, జయరాయన్ గ్రామ పంచాయతీ యూనియన్ వైస్ చైర్మన్ జయవేలు, గ్రామ పంచాయతీ అధ్యక్షుడు వేలాయుధం, తాయార్ మునుస్వామితో సహా అనేక మంది పాల్గొన్నారు.
Advertisement
Advertisement