అది లంచం కింద ఇచ్చిన వాచ్ | complaint against CM Siddaramaiah gold watch at ACB | Sakshi
Sakshi News home page

అది లంచం కింద ఇచ్చిన వాచ్

May 14 2016 8:46 AM | Updated on Aug 17 2018 12:56 PM

అది లంచం కింద ఇచ్చిన వాచ్ - Sakshi

అది లంచం కింద ఇచ్చిన వాచ్

ముగిసిపోయిందనుకున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వాచీ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది.

  ఏసీబీలో సీఎంపై ఫిర్యాదు
బెంగళూరు: ముగిసిపోయిందనుకున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వాచీ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. అవినీతి పరులైన అధికారులను రక్షించినందుకు గాను లంచంగా ఆ వాచ్‌ సీఎం చేతికి వచ్చి చేరిందంటూ సామాజిక కార్యకర్త టి.జె.అబ్రహాం ఏసీబీలో సీఎం సిద్ధరామయ్య పై ఫిర్యాదు చేశారు.

పీడబ్ల్యూడీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ ఎల్‌.రఘు, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు అధ్యక్షుడు ఎల్‌.లక్ష్మణ్‌కు సీఎంకు ఆ వాచ్‌ను అందజేశారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎల్‌.రఘు, ఎల్‌.లక్ష్మణ్‌లపై లోకాయుక్తలో కేసులు ఉన్నాయని ఈ కేసులకు సంబంధించి విచారణ ముందుకు సాగకుండా ఉండేందుకు లంచంగా ఆ వాచ్‌ను సీఎం సిద్ధరామయ్యకు అందజేశారని ఆరోపించారు. వీరిద్దరూ సీఎం వర్గానికి చెందిన వారు కావడంతో స్వజాతి ప్రేమతో ఇదంతా చేశారని, అందువల్ల తక్షణమే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అవినీతి నిరోధక చట్టం కింద చర్యలు తీసుకోవాలని తన ఫిర్యాదులో కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement