పెద్దమ్మకు కేసీఆర్‌ సతీమణి పూజలు | CM KCR wife offers special prayers in bhadrachalam | Sakshi
Sakshi News home page

పెద్దమ్మకు కేసీఆర్‌ సతీమణి పూజలు

Jan 9 2017 11:48 AM | Updated on Aug 14 2018 10:54 AM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని పెద్దమ్మ గుడిలో సీఎం కేసీఆర్‌ సతీమణి శోభ ప్రత్యేక పూజలు చేశారు.

పాల్వంచ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని పెద్దమ్మ గుడిలో సీఎం కేసీఆర్‌ సతీమణి శోభ ప్రత్యేక పూజలు చేశారు. ఆమెకు ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. పూజల అనంతరం ఆమెకు ఆశీర్వచనం అందజేశారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శోభ ఆదివారం సాయంత్రం భద్రాచలం వచ్చారు. ఈ రోజు ఉదయం ఉత్తర ద్వారంలో శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకుని పాల్వంచ చేరారు. అమ్మవారికి ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్‌ దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు.

Advertisement
 
Advertisement
Advertisement