జయలలిత మళ్లీ ముఖ్యమం త్రి పదవి స్వీకరించాలనే ఆశయంతో అన్నాడీఎంకే శ్రేణులు తిరుత్తణి సుబ్రమణ్యస్వామి
పళ్లిపట్టు: జయలలిత మళ్లీ ముఖ్యమం త్రి పదవి స్వీకరించాలనే ఆశయంతో అన్నాడీఎంకే శ్రేణులు తిరుత్తణి సుబ్రమణ్యస్వామి ఆలయంలో స్వర్ణ రథోత్సవం నిర్వహించి పూజలు చేశారు. తిరుత్తణి నియోజకవర్గ అన్నాడీఎంకే ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంగా జీవించాలని, అలాగే త్వర లో రాష్ట్ర అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి మళ్లీ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టాలనే ఆశయంతో ఆమె జన్మనక్షత్రం మహం నక్షత్రం సందర్భం గా మంగళవారం రాత్రి తిరుత్తణి ఆల యంలో విశిష్ట పూజలు, స్వర్ణరథోత్స వం నిర్వహించారు.
వేడుకలకు నియోజకవర్గ అన్నాడీఎంకే కార్యదర్శి,తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాల ఆవిన్‌పాల్ ఉత్పత్తిదారుల సహాకార సంఘం ఆధ్యక్షుడు వేలంజేరి చంద్రన్ అధ్యక్షత వహించారు. రాష్ట్ర ప్రభుత్వ మాజీ న్యూఢిల్లీ ప్రతినిధి పీఎమ్.నరసింహన్ సమక్షంలో నిర్వహించిన వేడుకల్లో ముఖ్య అతిధిగా ఆ పార్టీ తిరువళ్లూరు జిల్లా కార్యదర్శి పాడిపరిశ్రమ శాఖా మంత్రి బీవీ.రమణ పాల్గొన్నారు. ముం దుగా సుబ్రమణ్యస్వామికి విశిష్ట అభిషేక ఆరాధన పూజలు నిర్వహించారు.
అనంతరం మేళతాళాలు నడుమ ఆలయం నుంచి వల్లి దేవసేన సమేత ఉత్సవర్లు షణ్ముఖస్వామిని స్వర్ణరధంలో కొలువుదీర్చి హారంహర నామస్మరణ నడుమ మంత్రి ఇతర ప్రముఖులు రధాన్ని ఆలయ మాడ వీధుల్లో విహరించారు. అనంతరం నిరుపేద కుటుంబాలకు చెందిన 200 మంది వృధ్దులకు చీర ధోవతులు పంపిణీ చేసి అన్నదానం పంపిణీ చేసారు. ఇందులో స్థానిక ఎమ్మెల్యే అరుణ్‌సుబ్రమణ్యం, యూనియన్ చైర్మన్లు ఆర్.ఇళంగోవన్, గుణాళన్, మున్సిపల్ చైర్మన్ సౌందర్‌రాజన్, పార్టీ శ్రేణులు జయరామన్, కరుణాకరన్, రాజపాండి, గ్రామ పంచాయతీ అధ్యక్షుల పెడరేసన్ అధ్యక్షులు సెల్వం, వేలాయుధం, రవి సహా భారీ సంఖ్యలో ఆ పార్టీ శ్రేణులు పాల్గొని పూజలు చేశారు.