కావేరి సెగతో మారిన పెళ్లి వేదిక | Cauvery issue: Braving Karnataka, bride walks miles to reach Tamil Nadu | Sakshi
Sakshi News home page

కావేరి సెగతో మారిన పెళ్లి వేదిక

Sep 15 2016 8:33 AM | Updated on Sep 27 2018 8:27 PM

కావేరి సెగతో మారిన పెళ్లి వేదిక - Sakshi

కావేరి సెగతో మారిన పెళ్లి వేదిక

కావేరి జల వివాదం నేపథ్యంలో బెంగళూరులో జరుగుతున్న అల్లర్లతో అక్కడ జరగాల్సిన పెళ్లి తమిళనాడుకు మారింది.

తమిళనాడుకు తరలిన పెళ్లి బృందం
హోసూరు:
కావేరి జల వివాదం నేపథ్యంలో బెంగళూరులో జరుగుతున్న అల్లర్లతో అక్కడ జరగాల్సిన పెళ్లి తమిళనాడుకు మారింది. తిరువణ్ణామలైకు చెందిన రంజిత్‌(25) బెంగళూరులో భవన నిర్మాణకార్మికుడుగా పని చేస్తున్నాడు. రంజిత్‌కు తిరువణ్ణామలైకే చెందిన సౌమ్యతో బుధవారం బెంగళూరులో పెళ్లి జరిపేందుకు ముహుర్తం నిర్ణయించారు. ఆహ్వాన పత్రికలూ ముద్రించారు. పెళ్లి పీటలు సిద్ధమయ్యాయి. కానీ బెంగళూరులో ఉద్రిక్తత కొనసాగుతుండటంతో  కర్ఫ్యూ విధించారు.

ఈ నేపథ్యంలో పెళ్లి చేయడం సాధ్యం కాదని గ్రహించిన పెళ్లి బృందం మొత్తం సామగ్రి సర్దుకొని తమిళనాడులోని తిరువణ్ణామలైకు తరలివెళ్లారు. వీరు బెంగళూరు నుండి అత్తిపల్లి వరకు కర్ణాటక బస్సులో అక్కడి నుండి కిలోమీటర్‌ దూరం పెళ్లి దుస్తులతోనే నడచి వచ్చి జూజువాడి వద్ద తమిళనాడు ఆర్టీసీ బస్సులలో తిరువణ్ణామలైకు వెళ్లారు.

Advertisement
 
Advertisement
Advertisement