వేలూరు కలెక్టరేట్ సమీపంలోని జాతీయ రహదారిపై కారు దగ్ధమైంది. చెన్నై త్యాగరాజనగర్‌కు చెందిన ధనంజయన్ కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం హోసూర్‌కు వెళ్లారు.
నడిరోడ్డుపై కారు దగ్ధం
Sep 13 2013 1:49 AM | Updated on Sep 1 2017 10:39 PM
వేలూరు, న్యూస్‌లైన్: వేలూరు కలెక్టరేట్ సమీపంలోని జాతీయ రహదారిపై కారు దగ్ధమైంది. చెన్నై త్యాగరాజనగర్‌కు చెందిన ధనంజయన్ కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం హోసూర్‌కు వెళ్లారు. సాయంత్రం తిరిగి కారులో బయలు దేరారు. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో వేలూరు కలెక్టరేట్ సమీపంలోని జాతీయ రహదారి బ్రిడ్జిపై వస్తున్న సమయంలో కారు నుంచి చిన్నగా మంటలు వచ్చాయి. దీనిని గమనించిన ధనంజయన్ కారును ఆపి వెంటనే కిందకు దిగాడు.
మంటలు పెద్దవి కావడంతో కారులోని భార్య, ఇద్దరు పిల్లలను కిందకు దింపి కారులోని విలువైన సామాగ్రిని కిందకు వేసి పరుగులు తీశారు. దీన్ని గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సిబ్బంది వచ్చే సరికి కారు పూర్తిగా కాలి బూడిదైంది. ఈ మేరకు సత్‌వాచ్చారి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నడి రోడ్డుపై కారు దగ్ధం కావడంతో సుమారు అరగంట పాటు జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
Advertisement
Advertisement