వెంటనే విధుల్లో చేరండి.. లేకుంటే చర్యలు తప్పవు | bombay high court warns doctors to call off strike | Sakshi
Sakshi News home page

వెంటనే విధుల్లో చేరండి.. లేకుంటే చర్యలు తప్పవు

Mar 21 2017 5:33 PM | Updated on Oct 8 2018 5:45 PM

వెంటనే విధుల్లో చేరండి.. లేకుంటే చర్యలు తప్పవు - Sakshi

వెంటనే విధుల్లో చేరండి.. లేకుంటే చర్యలు తప్పవు

మహారాష్ట్ర లో సమ్మె చేస్తున్న వైద్యులపై బాంబే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

ముంబై: మహారాష్ట్ర లో సమ్మె చేస్తున్న వైద్యులపై బాంబే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వైద్యులు వెంటనే విధుల్లో చేరాలని, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించింది. వైద్యులు విధులు బహిష్కరించి వరుసగా రెండో రోజూ సమ్మె కొనసాగించడంపై రోగులు ఇబ్బంది పడుతున్నారు.

తమపై జరుగుతున్న దాడులకు నిరసనగా మహారాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4 వేలమంది వైద్యులు సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. తమకు భద్రత కల్పించాలంటూ ఆందోళన చేపట్టారు. వైద్యులు సమ్మెకు దిగడంతో రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సేవలు స్తంభించిపోయాయి. రోగులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. కొన్ని ఆస్పత్రుల్లో రోగుల కోసం అత్యవసర ఏర్పాట్లు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement