కాకతీయ మెడికల్ కాలేజీలో ఆదివారం బాంబు బెదిరింపు కాల్ కలకలం రేపింది.
మెడికల్ కాలేజీకి బాంబు బెదిరింపు కాల్
Sep 18 2016 7:45 PM | Updated on Sep 4 2017 2:01 PM
వరంగల్ : వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో ఆదివారం బాంబు బెదిరింపు కాల్ కలకలం రేపింది. కాలేజీలో బాంబు పెట్టామని గుర్తుతెలియని ఆగంతకుడు పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో పోలీసులు కాలేజీకి డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్ బృందాలతో తనిఖీలు చేపట్టి...చివరికి బాంబు లేదని తేల్చారు. దీంతో పోలీసులు, కాలేజీ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. త్వరలో అంగతకుడిని పట్టుకుంటామని పోలీసులు చెప్పారు.
Advertisement


