అందంగా కనిపిస్తాను | Beautifully appear | Sakshi
Sakshi News home page

అందంగా కనిపిస్తాను

Mar 24 2015 2:10 AM | Updated on Sep 2 2017 11:16 PM

అందంగా కనిపిస్తాను

అందంగా కనిపిస్తాను

ఇక పై విభిన్న నందితను చూస్తారంటోంది నందిత.

ఇక పై విభిన్న నందితను చూస్తారంటోంది నందిత. అట్టకత్తి చిత్రం ద్వారా కోలీవుడ్‌లోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ తమిళ ప్రేక్షకుల నుంచి పక్కింటి అమ్మాయిగా పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం చేతిలో రెండు మూడు చిత్రాలతో బిజీగా ఉన్న నందిత త్వరలో హార్రర్ చిత్రంలో భయపెట్టడానికి సిద్ధం అవుతోంది. యువనటుడు శివ హీరోగా నటించనున్న ఈ చిత్రం ఏప్రిల్‌లో సెట్‌పైకి రానుంది. ప్రస్తుతం రాధామోహన్ దర్శకత్వంలో ఉప్పుకరువాడు చిత్రంతో పాటు భరత్‌బాలా శిష్యుడు రాజశేఖర్ మోగాఫోన్ పట్టిన నూతన చిత్రంలో నటిస్తోంది.

వీటి గురించి నందిత మాట్లాడుతూ ఇప్పటి వరకు పక్కింటి అమ్మాయిగా చూసిన తనను ఇకైపై విభిన్న పాత్రల్లో చూస్తారంది. ఉప్పుకరువాడు చిత్రంలో తన పాత్రను దర్శకుడు రాధామోహన్ చాలా కొత్తగా తీర్చిదిద్దుతున్నారని పేర్కొంది. నవ దర్శకుడు రాజశేఖర్ చిత్రంలో నాగరికతతో కూడిన గ్లామరస్ పాత్రను పోషిస్తునట్లు చెప్పింది. ఈ పాత్రలో తాను కలర్‌ఫుల్ దుస్తుల్లో చాలా అందంగా కనిపిస్తానని నందిత చెబుతోంది.
 

Advertisement
 
Advertisement
Advertisement