సిద్ధమవుతున్న 'బాహుబలి' | Baahubali Inspires ganesh Idols | Sakshi
Sakshi News home page

సిద్ధమవుతున్న 'బాహుబలి'

Jul 17 2015 12:49 PM | Updated on Sep 3 2017 5:41 AM

బాహుబలి సినిమా విడుదలై...వసూళ్ల సునామీ సృష్టిస్తుంటే...ఇప్పుడు బాహుబలి సిద్ధం అవుతున్నాడని వార్తేంటా అనుకుంటున్నారా? విషయంలోకి వెళితే...త్వరలో

త్వరలో వచ్చే వినాయక చవితికి ....గణనాధుడు సిద్ధం అవుతున్నాడు. సీజన్ బట్టి అన్నట్లుగా... విగ్రహాలు తయారు చేసేవాళ్లు కూడా ట్రెండ్ను ఫాలో అవుతుంటారు. సూపర్ హిట్ సినిమాల్లో హీరోలుగా నటించిన వారిలా వినాయకుడి విగ్రహాలను రూపొందించడం చాలా కాలంగా జరుగుతూనే ఉంది. 

 

గతంలో అపరిచితుడు, మగధీర, ఈగ, రోబోగా ...గణనాధులను రూపొందించిన తయారీదారులు ఈసారి.. ఆ క్రేజ్ను ఒడిసిపట్టుకున్నారు. దేశవ్యాప్తంగా భారీ వసూళ్లతో సంచలనం సృష్టిస్తున్న 'బాహుబలి' చిత్రంలో హీరో ప్రభాస్ ...శివలింగాన్ని ఎత్తే దృశ్యాన్ని ప్రేరణగా తీసుకుని వినాయకుడిని బాహుబలిగా రూపుదిద్దుతున్నారు. వారి చేతుల్లో బాహుబలి మెరుగులు దిద్దుకుంటున్నాడు. అయితే ఈ బాహుబలుడు తయారయ్యేది ...రెండు తెలుగు రాష్ట్రాల్లో కాదండోయ్... మహారాష్ట్రలోని షోలాపూర్ లో తయారు కావటం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement