మహిళపై అత్యాచార యత్నం ఆటోడ్రైవరు అరెస్ట్ | Auto driver arrested for rape on woman | Sakshi
Sakshi News home page

మహిళపై అత్యాచార యత్నం ఆటోడ్రైవరు అరెస్ట్

Aug 27 2015 1:41 AM | Updated on Jul 28 2018 8:53 PM

మహిళపై అత్యాచారానికి ప్రయత్నించిన ఆటోడ్రైవర్‌ను బ్యాటరాయణపుర పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు.

బెంగళూరు(బనశంకరి): మహిళపై అత్యాచారానికి ప్రయత్నించిన ఆటోడ్రైవర్‌ను బ్యాటరాయణపుర పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. నిందితుడిని బ్యాటరాయణపుర పోలీస్ స్టేషన్‌లో హెల్పర్‌గా పనిచేస్తున్న వ్యక్తి కుమారుడు ఆనంద్‌గా గుర్తించారు. వివరాల్లోకి వెళితే... ఈ నెల 24న సాయంత్రం బనశంకరి అపార్ట్‌మెంట్‌కు వెళ్లేందుకు ఓ మహిళ తిలక్ నగర వద్ద ఆనంద్ ఆటో ఎక్కారు. కూళగేరిలోని నిర్జన ప్రదేశంలోకి ఆటోను తీసుకెళుతుండగా గుర్తించిన మహిళ వెంటనే ఆటోను ఆపాలని డ్రైవర్‌కు సూచించారు.

ఆ సమయంలో ఆనంద్ ఆమె మెడలో ఉన్న బంగారు నగలు లాక్కొని, బెదిరించి అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. వెంటనే ఆమె సహాయం కోసం కేకలు వేయడంతో అదే మార్గంలో వెళుతున్న వాహన డ్రైవర్లు అక్కడకు చేరుకున్నారు. వారిని గమనించి ఆటోతో సహా ఆనంద్ పారిపోయాడు. ఘటనపై బాధితురాలు బ్యాటరాయణపుర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో తాను ఎక్కిన ఆటో నంబర్‌ను కూడా పేర్కొనడంతో పోలీసులు వెంటనే నిందితుడి కోసం గాలించి బుధవారం అరెస్ట్ చేశారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement