ఏఎన్ 32 విమానంలోని వారంతా మరణించినట్లే! | An -32 aircraft crew all died...! | Sakshi
Sakshi News home page

ఏఎన్ 32 విమానంలోని వారంతా మరణించినట్లే!

Sep 16 2016 2:35 AM | Updated on Apr 8 2019 7:50 PM

ఏఎన్ 32 విమానంలోని వారంతా మరణించినట్లే! - Sakshi

ఏఎన్ 32 విమానంలోని వారంతా మరణించినట్లే!

జూలైలో గల్లంతైన ఏఎన్-32 ఎయిర్‌క్రాఫ్ట్‌లోని 29 మంది సిబ్బంది అంతా మృతి చెందినట్లు భావిస్తున్నామని భారత వైమానిక దళం వారి బంధువులకు తెలియజేసింది.

న్యూఢిల్లీ: జూలైలో గల్లంతైన ఏఎన్-32 ఎయిర్‌క్రాఫ్ట్‌లోని 29 మంది సిబ్బంది అంతా మృతి చెందినట్లు భావిస్తున్నామని భారత వైమానిక దళం వారి బంధువులకు తెలియజేసింది. గాలింపు చర్యలు, దొరికిన సాక్ష్యాలను బట్టి ప్రయాణికులు బతికుండే వీలు లేదని నిర్ధారణకు వచ్చినట్లు తెలిపింది.

ఆగస్టు 24వ తేదీతో ఉన్న లేఖను ఆయా కుటుంబాలకు పంపింది. అలాగే బీమా, ఇతర కార్యక్రమాల విషయంలో ముందుకెళ్లవచ్చని సూచించింది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన గాలింపు కార్యక్రమా లు కొనసాగుతాయని ఎయిర్‌ఫోర్స్ వర్గాలు పేర్కొన్నాయి. చైన్నై సమీపంలోని తాంబరం వైమానిక స్థావరం నుంచి అండమాన్ నికోబార్ దీవుల్లోని పోర్ట్‌బ్లెయిర్‌కు బయలుదేరిన ఒక రవాణా విమానం బంగాళాఖాతంలో జూలై 22న కన్పించకుండా పోయిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement