భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా నల్లగొండ జిల్లా రెండో రోజు పర్యటన కొనసాగుతోంది.
'తెలంగాణలో బీజేపీదే అధికారం'
May 23 2017 2:52 PM | Updated on Aug 29 2018 4:18 PM
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా నల్లగొండ జిల్లా రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. జిల్లాలోని పెద్దదేవుల పల్లిలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో 2019 లో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు. పార్టీ గత రెండు ఏళ్లుగా పోరాటం చేస్తోందని..మోదీ అభివృద్ధి కావాలంటే బీజేపీ అధికారంలోకి రావాలన్నారు. దక్షిణ భారతంలో బీజేపీ అధికారానికి తెలంగాణ ముఖ ద్వారంగా ఉంటందని ఆశాభావం వ్యక్తం చేశారు. మోదీ అభివృద్ధితో పాటు దేశ రక్షణ కోసం సర్జికల్ స్ట్రైక్స్ చేస్తురన్నారు. మోదీని బలపరచడానికి తెలంగాణ ప్రజలంతా వచ్చారన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
Advertisement
Advertisement