నేనింతే | Actress Anushka Shetty honorarium hiked | Sakshi
Sakshi News home page

నేనింతే

Nov 27 2014 2:26 AM | Updated on Sep 2 2017 5:10 PM

నేనింతే

నేనింతే

అందం, అభినయం కలగలసిన నటి అనుష్క. ఈమె దక్షిణాదిలో టాప్ హీరోయిన్ అనడం అతిశయోక్తి కాదెమో.

అందం, అభినయం కలగలసిన నటి అనుష్క. ఈమె దక్షిణాదిలో టాప్ హీరోయిన్ అనడం అతిశయోక్తి కాదెమో. ఈ భామ చేతిలో ప్రస్తుతం నాలుగు భారీ చిత్రాలున్నాయి. వీటిలో రెండు తమిళ్, రెండు తెలుగు. తమిళంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ సరసన నటించిన లింగా చిత్రం వచ్చే నెల 12న తెరపైకి రానుంది. అజిత్‌కు జంటగా నటించిన ఎన్నై అరుందాల్ సంక్రాంతికి సందడి చేయనుంది. అలాగే తెలుగులో రుద్రమదేవిగా నటించిన భారీ చారిత్రాత్మక చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. ఇక దక్షిణాది సినీ చరిత్రలోనే భారీ బడ్జెట్‌లో రూపొందుతున్న చిత్రం బాహుబలి. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రథమార్థంలో విడుదల చెయ్యడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
 
 ఇలా వరసగా భారీ చిత్రాలను సొంతం చేసుకున్న అనుష్క పారితోషికం భారీగా పెంచిందని, గర్వం బాగా పెరిగిపోయిందని కోలీవుడ్ వర్గాల టాక్. దీనికి దీటుగానే బదులిస్తోంది అనుష్క. నటిగా తన అంతస్తు పెరిగిందని చెప్పింది. సూపర్‌స్టార్ రజనీకాంత్ సరసన నటించే స్థాయికి చేరుకున్నానని పేర్కొంది. తెలుగులోనూ రుద్రమదేవి, బాహుబలి వంటి భారీ చిత్రాలు తన చేతిలో ఉన్నాయని తెలిపింది. అయితే అహంకారం, గర్వం, అసూయ అనేవి తన దరిదాపుల్లో లేవని స్పష్టం చేసింది. సినీ రంగ ప్రవేశానికి ముందు ఎలా ఉన్నానో ఇప్పుడు అలానే ఉన్నానని వెల్లడించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement