39 మంది బైక్‌ రేసర్ల అరెస్ట్‌ | 39 bike racers arrested in vishakapatnam | Sakshi
Sakshi News home page

39 మంది బైక్‌ రేసర్ల అరెస్ట్‌

Feb 27 2017 2:25 PM | Updated on Sep 19 2019 2:50 PM

విశాఖ బీచ్‌ రోడ్‌లో బైక్‌ రేసింగ్‌లకు పాల్పడుతున్న యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

విశాఖపట్నం: విశాఖ బీచ్‌ రోడ్‌లో బైక్‌ రేసింగ్‌లకు పాల్పడుతున్న యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 39 మంది యువకులు హైసీసీ బైక్‌లపై శుక్రవారం రాత్రి విచ్చలవిడిగా డ్రైవింగ్‌ చేశారని, పోలీసులు అడ్డగించినా వారు ఆగలేదని ట్రాఫిక్‌ ఏడీసీపీ మహేంద్రపాత్రుడు తెలిపారు. వారందరినీ గుర్తించి అదుపులోకి తీసుకుని, బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. యువకులు, వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు చేయడంతో పాటు బైక్‌లను సీజ్‌ చేస్తామని హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement