నిందితుడి వివరాలు వెల్లడిస్తున్న ఇన్స్పెక్టర్ సీతయ్య
పోలీసులపైకి దూసుకొచ్చిన ‘ఘోస్ట్’
యువకుడి అరెస్ట్
సాక్షి హైదరాబాద్: వాహన తనిఖీలు నిర్వహిస్తున్న అత్తాపూర్ పోలీసుల పైకి నెంబర్ ప్లేట్ లేని కారులో దూసుకువచ్చిన యువకుడిని అత్తాపూర్ పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరపరిచారు. న్యాయమూర్తి యువకుడికి జ్యూడిషియల్ రిమాండ్కు తరలించారు.
ఇన్స్పెక్టర్ సీతయ్య తెలిపిన మేరకు.. గురువారం అర్ధరాత్రి పిల్లర్ నంబర్ 133 వద్ద అత్తాపూర్ పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ యువకుడు ‘ఘోస్ట్’ అని ఆంగ్లంలో రాసి ఉన్న నెంబర్ ప్లేట్ లేని కారులో వేగంగా దూసుకువచ్చి పోలీసులను చూసి అదే వేగంతో వెనక్కు వెళ్లాడు. పోలీసులు వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించగా మరింత వేగంతో ముందుకు దూసుకువచ్చాడు.
మితిమీరిన వేగంతో ఉండడంతో పోలీసులు అప్రమత్తమై పక్కకు జరగడంతో పెను ప్రమాదం తప్పింది. నెంబర్ ప్లేటుపై గోస్ట్ అని రాసి ఉంది.శుక్రవారం సీసీ కెమెరాలు జల్లెడ పట్టి చివరకు టోలిచౌకి సాలార్జంగ్ కాలనీకి చెందిన మహమ్మద్ ఫయాద్ఉద్దీన్(20)గా గుర్తించారు. సుజుకి ఫ్రాంక్స్ కారును, నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేశారు.
ఇదీ చదవండి: భక్తులపై దూసుకెళ్లిన ట్రక్.. 11 మంది మృతి


