ఈతకు వెళ్లిన ఇద్దరు నీట మునిగి మృత్యవాత పడ్డారు.
ఈతకు వెళ్లి ఇద్దరి మృతి
Oct 6 2016 3:26 PM | Updated on Aug 25 2018 6:13 PM
హైదరాబాద్: ఈతకు వెళ్లిన ఇద్దరు నీట మునిగి మృత్యవాత పడ్డారు. వేర్వేరు చోట్ల జరిగిన ఈ ప్రమాదంలో ఒకరు టెన్త్ విద్యార్థి కాగా, మరో యువకుడు ఉన్నాడు. వరంగల్ జిల్లా హనుమకొండ మండలం సింహాపురం గ్రామ శివారులోని బెస్తచెరువులో ఈతకు వెళ్లిన ఇమ్మడి భవన్ అనే టెన్త్ విద్యార్థి చెరువులో మునిగి మృతి చెందాడు. సింహపురం గ్రామానికి చెందిన నలుగురు విద్యార్థులు గురువారం మధ్యాహ్నం బెస్త చెరువులో ఈతకు వెళ్లారు. వారిలో భవన్ చెరువులో మునిగి మృతి చెందాడని మిగిలి ముగ్గురు విద్యార్థులు గ్రామంలోకి వచ్చి తల్లిదండ్రులకు తెలిపారు. వారు చెరువు వద్దకు వెళ్లి గాలింపు చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి బయలుదేరారు.
మరో వైపు కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలకేంద్రం ఇంద్రానగర్‌లో విషాదం చోటు చేసుకుంది. స్థానికంగా నివాసముంటున్నఅజయ్(20) అనే యువకుడు మానేరు వాగులో ఈతకెళ్లి ప్రమాదవశాత్తూ మృత్యువాతపడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Advertisement
Advertisement