ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మృతి చెందిన సంఘటన నల్లగొండ జిల్లాలో జరిగింది.
సంపులో పడి రెండేళ్ల చిన్నారి మృతి
Sep 24 2016 11:40 AM | Updated on Sep 4 2017 2:48 PM
బీబీనగర్: ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మృతి చెందిన సంఘటన నల్లగొండ జిల్లాలో జరిగింది. జిల్లాలోని బీబీనగర్ మండలం కొండమడుగులో శనివారం ఉదయం ఈ సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రెండేళ్ల చిన్నారి ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలో తల్లిదండ్రులు గమనించకపోవడంతో.. నీటి సంపులో పడి మృతి చెందాడు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Advertisement
Advertisement