ఊపిరి పీల్చుకున్న జింబాబ్వే | Zimbabwe beats Hong Kong by 14 runs | Sakshi
Sakshi News home page

ఊపిరి పీల్చుకున్న జింబాబ్వే

Mar 8 2016 11:58 PM | Updated on Sep 3 2017 7:16 PM

ఊపిరి పీల్చుకున్న జింబాబ్వే

ఊపిరి పీల్చుకున్న జింబాబ్వే

రల్డ్ టీ 20లో జింబాబ్వే శుభారంభం చేసింది. క్వాలిఫయింగ్ రౌండ్లో భాగంగా ఇక్కడ హాంకాంగ్తో జరిగిన పోరులో జింబాబ్వే 14 పరుగుల తేడాతో విజయం సాధించింది.

* హాంకాంగ్‌పై విజయం
* టి20 ప్రపంచకప్ క్వాలిఫయర్స్

నాగ్‌పూర్: అంతర్జాతీయ క్రికెట్‌లో తమ అనుభవాన్ని ఉపయోగించి ఆడిన జింబాబ్వే జట్టు గట్టి సవాల్ విసిరిన హాంకాంగ్‌పై 14 పరుగుల తేడాతో నెగ్గింది. టి20 ప్రపంచకప్ క్వాలిఫయర్స్ గ్రూప్ ‘బి’లో భాగంగా మంగళవారం జరిగిన ఈమ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 20 ఓవర్లలో 8 వికెట్లకు 158 పరుగులు చేసింది. 62 పరుగులకే నాలుగు వికెట్లు పడినా ఓపెనర్ సిబండా (46 బంతుల్లో 59; 5 ఫోర్లు; 2 సిక్సర్లు) జట్టును ఆదుకున్నాడు.

అయితే చివర్లో చిగుంబురా (13 బంతుల్లో 30 నాటౌట్; 3 సిక్సర్లు) ఆడిన మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టు 150 పరుగులు దాటింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన హాంకాంగ్ 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 144 పరుగులు చేసింది. ఓపెనర్ అట్కిన్సన్ (44 బంతుల్లో 53; 4 ఫోర్లు; 2 సిక్సర్లు) టాప్ స్కోరర్. కెప్టెన్ అఫ్జల్ (17 బంతుల్లో 31 నాటౌట్; 3 ఫోర్లు; 1 సిక్స్) ధాటిగా ఆడి ఆందోళన పెంచినా బౌలర్లు చివర్లో కట్టడి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement