యశ్వంత్ సెంచరీ | yaswanth slams century in division cricket | Sakshi
Sakshi News home page

యశ్వంత్ సెంచరీ

Dec 3 2016 10:44 AM | Updated on Sep 4 2017 9:49 PM

యాటింగ్‌లో యశ్వంత్ (130), ప్రజ్వల్ రావు (90) బౌలింగ్‌లో వీరాస్వామి (5/62) మెరుగ్గా రాణించడంతో సత్యసీసీ జట్టు సునాయాసంగా గెలుపొందింది.

సాక్షి, హైదరాబాద్: బ్యాటింగ్‌లో యశ్వంత్ (130), ప్రజ్వల్ రావు (90) బౌలింగ్‌లో వీరాస్వామి (5/62) మెరుగ్గా రాణించడంతో సత్యసీసీ జట్టు సునాయాసంగా గెలుపొందింది. ఎ- డివిజన్ వన్డే లీగ్‌లో భాగంగా గోల్కొండ సీసీతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సత్యసీసీ జట్టు 52 పరుగుల తేడాతో గెలుపొందింది.

 

తొలుత బ్యాటింగ్ చేసిన సత్య సీసీ జట్టు 38.4 ఓవర్లలో 253 పరుగులకు ఆలౌటైంది. యశ్వంత్ సెంచరీతో ఆకట్టుకోగా... ప్రజ్వల్ రావు తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. గోల్కొండ సీసీ బౌలర్లలో శ్రీనికేత్ రెడ్డి, లోహిత్ చెరో 5 వికెట్లు పడగొట్టారు. అనంతరం 254 పరుగుల లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన గోల్కొండ సీసీ 28.4 ఓవర్లలో 201 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. సత్య సీసీ బౌలర్లలో వీరారెడ్డితో పాటు రిత్విక్ రెడ్డి (4/58) రాణించాడు. 

Advertisement
 
Advertisement
Advertisement