విజేత ప్రాంజల | Yadlapalli pranjala Win in ITF Women's Tournament | Sakshi
Sakshi News home page

విజేత ప్రాంజల

Jul 4 2017 12:12 AM | Updated on Sep 5 2017 3:06 PM

విజేత ప్రాంజల

విజేత ప్రాంజల

జూనియర్‌ బాలికల విభాగంలో పలు టైటిల్స్‌ సాధించిన హైదరాబాద్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ యడ్లపల్లి ప్రాంజల సీనియర్‌ స్థాయిలోనూ తన సత్తా చాటుకుంది.

సాక్షి, హైదరాబాద్‌: జూనియర్‌ బాలికల విభాగంలో పలు టైటిల్స్‌ సాధించిన హైదరాబాద్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ యడ్లపల్లి ప్రాంజల సీనియర్‌ స్థాయిలోనూ తన సత్తా చాటుకుంది. ఈజిప్ట్‌లో ముగిసిన అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) మహిళల టోర్నమెంట్‌లో 18 ఏళ్ల ప్రాంజల సింగిల్స్‌ చాంపియన్‌గా నిలిచింది. 2 గంటల 48 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో ప్రాంజల 6–7 (0/7), 7–5, 6–4తో క్లెరికి (ఇటలీ)పై నెగ్గింది. సీనియర్‌ స్థాయిలో ప్రాంజలకిదే తొలి ఐటీఎఫ్‌ సింగిల్స్‌ టైటిల్‌ కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో నాలుగు ఏస్‌లు సంధించిన ప్రాంజల, తన ప్రత్యర్థి సర్వీస్‌ను ఎనిమిదిసార్లు బ్రేక్‌ చేసింది. టోర్నీ మొత్తం ప్రాంజల కేవలం ఒక సెట్‌ మాత్రమే తన ప్రత్యర్థులకు కోల్పోవడం విశేషం.

Advertisement
 
Advertisement
Advertisement