జింబాబ్వే ఫస్ట్..ఆసీస్ లాస్ట్! | World Cup champions, have been whitewashed by South Africa | Sakshi
Sakshi News home page

జింబాబ్వే ఫస్ట్..ఆసీస్ లాస్ట్!

Oct 13 2016 1:29 PM | Updated on Sep 4 2017 5:05 PM

జింబాబ్వే ఫస్ట్..ఆసీస్ లాస్ట్!

జింబాబ్వే ఫస్ట్..ఆసీస్ లాస్ట్!

వన్డే క్రికెట్ చరిత్రలో ఆస్ట్రేలియా చెత్త రికార్డును మూటగట్టుకుంది.

కేప్టౌన్:ఇటీవల కాలంలో వన్డే క్రికెట్ లో క్లీన్ స్వీప్ల సీజన్ నడుస్తోంది. గత కొద్ది రోజుల క్రితం పాకిస్తాన్తో జరిగిన మూడు వన్డే సిరీస్లో వెస్టిండీస్ వైట్ వాష్ అయితే, తాజాగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఐదు వన్డేల సిరీస్ లో ఆసీస్ వైట్ వాష్ అయ్యింది. దాంతో ఐదు వన్డేల సిరీస్ లో ఒక్క గెలుపు కూడా లేకుండా వైట్ వాష్  అయిన అప్రథను ఆసీస్ తొలిసారి మూటగట్టుకోగా, ఆసీస్ పై ఈ సుదీర్ఘ సిరీస్ను దక్షిణాఫ్రికా క్లీన్ స్వీప్ చేసి సరికొత్త చరిత్రను లిఖించింది.
 

ఇదిలా ఉండగా, ప్రధాన వన్డే జట్లలో ఐదు వన్డేల సిరీస్ను అత్యధికసార్లు కోల్పోయిన జట్లలో జింబాబ్వే తొలిస్థానంలో ఉండగా, ఆసీస్ చివరి స్థానంలో ఉంది. ఐదు వన్డేల సిరీస్ ను ఇప్పటివరకూ జింబాబ్వే ఎనిమిదిసార్లు వైట్ వాష్ కాగా, వెస్టిండీస్ ఆరు వైట్ వాష్లతో రెండో స్థానంలో ఉంది. ఆ తరువాత న్యూజిలాండ్ నాలుగుసార్లు, ఇంగ్లండ్ మూడుసార్లు వైట్ వాష్ అయ్యాయి. అయితే ఐదు వన్డేల ద్వైపాక్షిక సిరీస్ లో భారత్, బంగ్లాదేశ్లు తలో రెండు సార్లు వైట్ వాష్ అయ్యాయి. కాగా, పాకిస్తాన్, శ్రీలంక, దక్షిణాఫ్రికా, కెన్యాలు ఒకసారి మాత్రమే ఐదు వన్డేల సిరీస్ లో వైట్ వాష్ అయ్యాయి. దాంతో ఐదు వన్డేల సిరీస్ లో వైట్ వాష్ అయిన జట్ల సరసన ప్రస్తుతం నంబర్ వన్ స్థానంలో ఉన్న ఆసీస్ కూడా చేరిపోయి ఆ జాబితాలో చివరిస్థానంలో నిలిచింది.

ఓవరాల్ గా వన్డే సిరీస్ లో ఆసీస్ వైట్ వాష్ కావడం ఇది ఏడోసారి. చివరిసారి 2012లో ఇంగ్లండ్ తో  జరిగిన నాలుగు వన్డేల సిరీస్ లో ఆసీస్ వైట్ వాష్ కాగా, 2006-07 సీజన్ లో న్యూజిలాండ్ 3-0తో ఆసీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. 1982-83 సీజన్ లో పాకిస్తాన్, శ్రీలంక చేతిలో ఆసీస్ వైట్ వాష్ అయ్యింది. అంతకుముందు 1980లో ఇంగ్లండ్ 2-0తో ఆసీస్ పై గెలిచింది. 1997లో మరోసారి ఇంగ్లండ్ 3-0తో ఆసీస్ ను క్లీన్ స్వీప్ చేసింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement