ఇదేంటి.. జట్టులో షమీ లేడు?  | World Cup 2019 Fans Wonder Why Shami Has Been Left Out In Semis | Sakshi
Sakshi News home page

ఇదేంటి.. జట్టులో షమీ లేడు? 

Jul 9 2019 6:50 PM | Updated on Jul 9 2019 6:57 PM

World Cup 2019 Fans Wonder Why Shami Has Been Left Out In Semis - Sakshi

నాలుగు మ్యాచ్‌ల్లో 14 వికెట్లు​.. ప్రస్తుత ప్రపంచకప్‌లో మహ్మద్‌ షమీ రికార్డు. అందులో ఒక హ్యాట్రిక్‌.

మాంచెస్టర్‌ : నాలుగు మ్యాచ్‌ల్లో 14 వికెట్లు​.. అందులో ఒక హ్యాట్రిక్‌.. ప్రస్తుత ప్రపంచకప్‌లో మహ్మద్‌ షమీ రికార్డు. కీలక సమయంలో వికెట్లు పడగొట్టడం.. స్లాగ్‌ ఓవర్లలో అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకునే షమీని టీమిండియా పక్కకు పెట్టింది. ప్రపంచకప్‌లో భాగంగా తొలి సెమీస్‌లో న్యూజిలాండ్‌తో టీమిండియా తలపడుతోంది. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా షమీని పక్కకు పెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. షమీని ఎందుకు జట్టులోకి తీసుకోలేదంటూ నెటిజన్లు, మాజీ క్రికెటర్లు ప్రశ్నిస్తున్నారు. ఈ సందర్భంగా వ్యాఖ్యాత హర్షా బోగ్లే కూడా షమీ జట్టులో లేకపోవడం తనను విస్మయానికి గురిచేసిందని పేర్కొన్నాడు. 

‘మహ్మద్‌ షమీ జట్టులో లేకపోవడం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. కీలక సమయాలలో వికెట్లు పడగొట్టడం షమీ స్టైల్‌. అంతేకాకుండా స్లాగ్‌ ఓవర్లలో అద్భుతమైన యార్కర్‌లు వేసి ప్రత్యర్థి జట్టును కట్టడి చేస్తాడు. అలాంటి షమీని జట్టులోకి ఎందుకు తీసుకోలేదు? ఇక రవీంద్ర జడేజాను తీసుకోవడం శుభపరిణామం.’అంటూ బోగ్లే ట్వీట్‌ చేశాడు. ఇక షమీని కాదని భువనేశ్వర్‌ను తీసుకోవడాన్ని పలువురు మద్దతిస్తున్నారు. భువీ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌ చేయగల సామర్థం ఉండటంతోనే షమీని కాదని అతడిని జట్టులోకి తీసుకున్నారని అభిప్రాయ పడుతున్నారు. సెమీస్‌ వంటి కీలక మ్యాచ్‌ల్లో లోయర్‌ ఆర్డర్‌  బ్యాటింగ్‌ బలంగా ఉండాలనే ఉద్దేశంతోనే భువీ, జడేజాలను జట్టులోకి తీసుకున్నారని పేర్కొంటున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement