రాజకీయాల్లోకి రాను: గంగూలీ | Will join 'Clean India' drive, not politics, says Sourav Ganguly | Sakshi
Sakshi News home page

రాజకీయాల్లోకి రాను: గంగూలీ

Dec 25 2014 5:05 PM | Updated on Sep 17 2018 5:18 PM

రాజకీయాల్లోకి రాను: గంగూలీ - Sakshi

రాజకీయాల్లోకి రాను: గంగూలీ

స్వచ్ఛభారత్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొనాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుకు మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ స్పందించారు.

కోల్కతా: స్వచ్ఛభారత్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొనాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుకు మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ స్పందించారు. ప్రధాని ఆహ్వానం మేరకు స్వచ్ఛ భారత్ లో పాల్గొంటానని చెప్పారు. అయితే రాజకీయాల్లోకి మాత్రం రానని ఆయన స్పష్టం చేశారు. ఆస్ట్రేలియాలో ఉన్న గంగూలీ ఓ టీవీ చానల్ తో ఫోన్ లో మాట్లాడారు.

స్వదేశానికి తిరిగొచ్చిన తర్వాత స్వచ్ఛ భారత్ లో పాల్గొంటానని పేర్కొన్నారు. తన రాజకీయ ప్రవేశంపై వస్తున్న ఊహాగానాలను ఆయన కొట్టిపారేశారు. రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని గతంలో చెప్పానని, దానికి కట్టుబడి ఉన్నానని అన్నారు. స్వచ్ఛభారత్ లో పాల్గొనాలని గంగూలీ సహా ముంబై డబ్బావాలాలు,  కామెడీ నైట్స్ వ్యాఖ్యాత కపిల్ శర్మ, కిరణ్ బేడీ తదితరులను మోదీ ఆహ్వానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement