'రోహిత్‌ ఎదగడానికి ధోనియే కారణం'

Where Rohit Sharma Is Today Its Credit Goes To MS Dhoni - Sakshi

ఢిల్లీ : టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మపై మాజీ ఆటగాడు గౌతమ్‌ గంభీర్‌ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. రోహిత్‌ శర్మ ఓపెనర్‌గా ఈ స్థాయిలో ఉన్నాడంటే అదంతా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని చలవేనని పేర్కొన్నాడు. 2007లో అరంగేట్రం చేసిన మొదటి రోజుల్లో రోహిత్‌ శర్మ చాలా మ్యాచ్‌ల్లో విఫలమయ్యాడు. అప్పుడు జట్టు కెప్టెన్‌గా ధోని చాలాకాలం పాటు మద్దతుగా నిలిచాడని స్టార్‌స్పోర్ట్ష్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో తెలిపాడు. ('ఆత్మహత్య చేసుకోవాలని మూడుసార్లు అనుకున్నా')

గంభీర్‌ మాట్లాడుతూ.. ' రోహిత్‌ అంతర్జాతీయ కెరీర్‌ను 2007లో ప్రారంభించినా అతని కెరీర్‌ ఊపందుకున్నది మాత్రం 2013 నుంచే... ఎందుకంటే జట్టులోకి వచ్చిన మొదట్లో రోహిత్‌ చాలా మ్యాచ్‌ల్లో విఫలమైనా అ‍ప్పటి కెప్టెన్‌ ధోని చాలా మద్దతునిచ్చాడు. రోహిత్​ను ఓపెనర్​గా పంపాలని మహీ 2013లో  నిర్ణయం తీసుకున్నాడు. అప్పటి నుంచి రోహిత్ శర్మ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఏకంగా వన్డేల్లో మూడు ద్విశతకాలను సాధించి ఎవరికి అందనంత ఎత్తులో నిలిచాడు. సెలెక్షన్ కమిటీ, జట్టు మేనేజ్​మెంట్​ గురించి మాట్లాడొచ్చు.. కానీ కెప్టెన్​ మద్దతు లేకపోతే అవన్నీ నిరుపయోగమే. అంతా కెప్టెన్ చేతుల్లోనే ఉంటుంది. ఈ విషయంలో మాత్రం రోహిత్​ శర్మకు ధోనీ చాలా కాలం మద్దతుగా నిలిచాడు. నాకు తెలిసి అంత సపోర్ట్ మరే ఆడగాడు పొందలేదని నేను అనుకుంటున్నా' అని గంభీర్‌ చెప్పుకొచ్చాడు. ప్రస్తుత యువ ఆటగాళ్లకు కెప్టెన్ విరాట్​ కోహ్లీ, రోహిత్ శర్మ మద్దతుగా నిలువాల్సిన అవసరం ఉందని గౌతమ్ గంభీర్ చెప్పాడు.
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top