విండీస్ కెప్టెన్‌గా స్యామీ | west indies captain darren sammy | Sakshi
Sakshi News home page

విండీస్ కెప్టెన్‌గా స్యామీ

Oct 5 2013 1:37 AM | Updated on Sep 1 2017 11:20 PM

వచ్చే నెలలో జరగనున్న భారత్ పర్యటన కోసం వెస్టిండీస్ టెస్టు జట్టును ఎంపిక చేశారు. మొత్తం 15 మంది సభ్యుల బృందాన్ని సెలక్షన్ కమిటీ ప్రకటించింది. పేసర్ డారెన్ స్యామీకి మరోసారి జట్టు పగ్గాలు అప్పగించారు.

సెయింట్ జాన్స్: వచ్చే నెలలో జరగనున్న భారత్ పర్యటన కోసం వెస్టిండీస్ టెస్టు జట్టును ఎంపిక చేశారు. మొత్తం 15 మంది సభ్యుల బృందాన్ని సెలక్షన్ కమిటీ ప్రకటించింది. పేసర్ డారెన్ స్యామీకి మరోసారి జట్టు పగ్గాలు అప్పగించారు.
 
 భారత్, వెస్టిండీస్‌ల మధ్య రెండు టెస్టులు (నవంబర్ 6 నుంచి 10; 14 నుంచి 18 వరకు) జరుగుతాయి. ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్న వెస్టిండీస్ ‘ఎ’ జట్టులోని ఏడుగురు ఆటగాళ్లకు జాతీయ జట్టులో చోటు దక్కింది. జట్టు: స్యామీ (కెప్టెన్), బెస్ట్, డారెన్ బ్రేవో, చందర్‌పాల్, కొట్రీల్, డియోనరైన్, ఎడ్వర్డ్స్, గేల్, పెరుమాల్, పావెల్, రామ్‌దిన్, రోచ్, శామ్యూల్స్, షిల్లాంగ్‌ఫోర్డ్, వాల్టన్.
 

Advertisement
 
Advertisement
Advertisement