ఉత్తరాఖండ్‌ కోచ్‌గా వసీమ్‌ జాఫర్‌ | Wasim Jaffer Will Be The Coach For Uttarakhand | Sakshi
Sakshi News home page

ఉత్తరాఖండ్‌ కోచ్‌గా వసీమ్‌ జాఫర్‌

Published Wed, Jun 24 2020 4:55 AM | Last Updated on Wed, Jun 24 2020 4:55 AM

Wasim Jaffer Will Be The Coach For Uttarakhand - Sakshi

ముంబై: ఆటగాడిగా క్రికెట్‌కు వీడ్కోలు పలికిన భారత టెస్టు జట్టు మాజీ ఓపెనర్‌ వసీమ్‌ జాఫర్‌ ఇకపై కోచ్‌గా కనిపించనున్నాడు. ఉత్తరాఖండ్‌ జట్టుకు హెడ్‌ కోచ్‌గా ఎంపికైనట్లు అతడే స్వయంగా మంగళవారం తెలిపాడు. ఈ పదవిలో జాఫర్‌ ఏడాదిపాటు కొనసాగనున్నాడు. దాదాపు రెండు దశాబ్దాల పాటు దేశవాళీ క్రికెట్‌లో కొనసాగిన అతడు ముంబై, విదర్భలకు ప్రాతినిధ్యం వహించాడు. అంతేకాకుండా రంజీ ట్రోఫీలో అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ ఏడాది మార్చిలో క్రికెట్‌కు వీడ్కోలు పలికిన జాఫర్‌... కోచ్‌ పదవి తనకు ఒక సవాల్‌లాంటిదని అభిప్రాయపడ్డాడు. ‘నేను మొదటిసారి ఒక జట్టుకు హెడ్‌ కోచ్‌గా పనిచేయబోతున్నా. ఈ పదవి ఒక సవాల్‌ లాంటిది. ఉత్తరాఖండ్‌ జట్టుతో కలిసి పనిచేయడం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నా’ అని జాఫర్‌ పేర్కొన్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement