పాపం వార్నర్‌.. చేసేది లేక ఇలా!

Warners Brilliant Response To Sandpaper Chants - Sakshi

బర్మింగ్‌హామ్‌: దాదాపు 16 నెలల క్రితం దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ట్యాంపరింగ్‌కు పాల్పడిన ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ను ఆ సెగ ఇంకా వదలడం లేదు. ట్యాంపరింగ్‌కు పాల్పడి ఏడాది పాటు నిషేధం ఎదుర్కొన్న వార్నర్‌.. సుదీర్ఘ విరామం తర్వాత తొలి టెస్టు ఆడుతున్నాడు. యాషెస్‌ సిరీస్‌ ద్వారా వార్నర్‌ మళ్లీ టెస్టుల్లో పునరాగమనం చేశాడు. అయితే వార్నర్‌కు ఇంగ్లండ్‌ అభిమానుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతూనే ఉంది. ఆసీస్‌ బ్యాటింగ్‌కు దిగిన సమయంలో వార్నర్‌ బ్యాట్‌ పట్టుకుని వెళుతున్న సందర్భంలో, ఔటైనప్పుడు కూడా ‘సాండ్‌ పేపర్‌’ అంటూ ఇంగ్లండ్‌ అభిమానులు ఎగతాళి చేశారు.

తాజాగా ఆసీస్‌ ఫీల్డింగ్‌ చేస్తున్న సమయంలో బౌండరీ లైన్‌ వద్ద ఉన్న వార్నర్‌కు మరొకసారి సాండ్‌ పేపర్‌ సెగ తగిలింది. భారీ స్థాయిలో ఇంగ్లండ్‌ అభిమానులు సాండ్‌ పేపర్‌ వార్నర్‌ అంటూ ఎద్దేవా చేయడంతో అందుకు నవ్వుతూనే సమాధానమిచ్చాడు. తన ప్యాంట్‌ జేబులను చూపించి మరీ సాండ్‌ పేపర్‌ లేదు కదా అంటూ తెలివిగా బదులిచ్చాడు. అది చూసిన వారు మాత్రం పాపం వార్నర్‌ అనుకుంటూ సరిపెట్టుకున్నారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top