11, 12 తేదీల్లో 'వీవీఎస్‌ అకాడమీ' సెలక్షన్స్‌ | VVS sports academy cricket selections | Sakshi
Sakshi News home page

11, 12 తేదీల్లో 'వీవీఎస్‌ అకాడమీ' సెలక్షన్స్‌

Mar 9 2017 12:08 PM | Updated on Sep 5 2017 5:38 AM

భారత మాజీ క్రికెటర్, స్టయిలిష్‌ బ్యాట్స్‌మన్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ స్పోర్ట్స్‌ అకాడమీ ఆధ్వర్యంలో క్రికెట్‌ సెలక్షన్స్‌ జరుగనున్నాయి.

సాక్షి, హైదరాబాద్‌: భారత మాజీ క్రికెటర్, స్టయిలిష్‌ బ్యాట్స్‌మన్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ స్పోర్ట్స్‌ అకాడమీ ఆధ్వర్యంలో క్రికెట్‌ సెలక్షన్స్‌ జరుగనున్నాయి. ఈనెల 11, 12 తేదీల్లో నిజామాబాద్‌లోని ఎంఎస్‌ఆర్‌ హైస్కూల్‌ ప్రాంగణంలో తొలి విడత సెలక్షన్స్‌ నిర్వహిస్తారు. ఇందులో ఎంపికైన అభ్యర్థులకు హైదరాబాద్‌లోని వీవీఎస్‌ స్పోర్ట్స్‌ అకాడమీలో రెండో విడత సెలక్షన్స్‌ జరుపుతారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ఏప్రిల్, మే నెలల్లో ఉచిత శిక్షణనిస్తారు.

 

శిక్షణాకాలంలో రాణించిన క్రీడాకారులకు జూన్‌ నుంచి హెచ్‌సీఏ నిర్వహిం చే లీగ్‌ మ్యాచ్‌ల్లో ఆడే అవకాశం దక్కుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 9 లోగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్‌ కోసం శ్రీనివాస్‌ (98489 45522)ను సంప్రదించవచ్చు.


 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement