లక్ష్మణ్‌ బౌలింగ్‌ లో గోపిచంద్‌ బ్యాటింగ్! | vvs laxman bowling to pullela gopichand | Sakshi
Sakshi News home page

లక్ష్మణ్‌ బౌలింగ్‌ లో గోపిచంద్‌ బ్యాటింగ్!

Jun 4 2014 7:50 PM | Updated on Sep 2 2017 8:19 AM

వివిఎస్‌ లక్ష్మణ్‌ బౌలింగ్‌లో పుల్లెల గోపిచంద్‌ బ్యాటింగ్‌... గోపిచంద్‌ బౌలింగ్‌లో లక్ష్మణ్‌ బ్యాటింగ్‌...ఇదెలా సాధ్యమని అనుకుంటున్నారు కదూ..

హైదరాబాద్‌: వివిఎస్‌ లక్ష్మణ్‌ బౌలింగ్‌లో పుల్లెల గోపిచంద్‌ బ్యాటింగ్‌... గోపిచంద్‌ బౌలింగ్‌లో లక్ష్మణ్‌ బ్యాటింగ్‌...ఇదెలా సాధ్యమని అనుకుంటున్నారు కదూ .. బుధవారం నాడిది సాధ్యమైంది. హైదరాబాద్‌ రాజీవ్‌ స్టేడియంలో బుధవారం ఆలిండియా స్పోర్ట్స్‌ జర్నలిస్టుల క్రీడల ప్రారంభోత్సంలో వీరిద్దరు సరదాగా క్రికెట్‌ ఆడారు. లక్ష్మణ్‌ బౌలింగ్‌లో గోపిచంద్‌ బ్యాటింగ్‌ చేస్తే, గోపిచంద్‌ బౌలింగ్‌లో లక్ష్మణ్‌ బ్యాటింగ్‌ చేశారు.

వీరితో పాటు సైబరాబాద్‌ పోలీసు కమీషనర్‌ సివి ఆనంద్‌ కూడా సరదాగా ఆడారు. లక్ష్మణ్‌, గోపిచంద్ లకు బౌలింగ్ చేసి అలరించారు. దేశ వ్యాప్తంగా నాలుగు జోన్ల నుండి క్రికెట్‌ టీమ్‌లతో పాటు అనేక రాష్ట్రాల టేబుల్‌ టెన్నిస్‌ టీమ్‌లు ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్నాయి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఇంకా అర్జున అవార్డీ ఖాసిం అలీ, 1983 విన్నింగ్‌ వల్డ్‌ కప్‌ మేనేజర్‌ పీఆర్ మాన్‌సింగ్‌, హైదరాబాద్‌ క్రికెట్‌ సెక్రటరీ వెంకటేశ్వరన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement