నేటి నుంచి వైజాగ్‌ ప్లే ఆఫ్‌ మ్యాచ్‌ల టికెట్ల అమ్మకాలు 

Vizag Play-offs ticket sales from today - Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా విశాఖపట్నం వేదికగా జరుగనున్న రెండు ప్లే ఆఫ్‌ మ్యాచ్‌లకు సంబంధించి ఆన్‌లైన్‌ టికెట్ల అమ్మకాలు శుక్రవారం ప్రారంభమవుతాయని ఆంధ్ర క్రికెట్‌ సంఘం (ఏసీఏ) కార్యదర్శి సీహెచ్‌ అరుణ్‌ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. డాక్టర్‌ వైఎస్సార్‌ ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో ఈనెల 8న ఎలిమినేటర్‌ మ్యాచ్‌... 10న క్వాలిఫయర్‌–2 మ్యాచ్‌ జరుగుతాయి.

టికెట్లను www.eventsnow.com   వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ అయి కొనుగోలు చేయాలి. బీసీసీఐ టికెట్ల ధరలను రూ. 500, 1000, 1500, 1750, 3500, 7500గా నిర్ణయించింది. తొలి అంతస్తులోని కార్పొరేట్‌ బాక్స్‌లో ఒక్కో టికెట్‌ రూ. 9000కు.. రెండో అంతస్తులోని కార్పొరేట్‌ బాక్స్‌లో ఒక్కో టికెట్‌ రూ. 5000కు లభిస్తాయి.    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top