రన్నరప్‌ విష్ణువర్ధన్‌ జోడి | vishnu vardhna settles as runnerup | Sakshi
Sakshi News home page

రన్నరప్‌ విష్ణువర్ధన్‌ జోడి

Mar 18 2017 10:38 AM | Updated on Sep 5 2017 6:26 AM

రన్నరప్‌ విష్ణువర్ధన్‌ జోడి

రన్నరప్‌ విష్ణువర్ధన్‌ జోడి

అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) ఫ్యూచర్స్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ ప్లేయర్‌ విష్ణువర్ధన్‌ జోడీ రన్నరప్‌గా నిలిచింది.

బెంగళూరు: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) ఫ్యూచర్స్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ ప్లేయర్‌ విష్ణువర్ధన్‌ జోడీ రన్నరప్‌గా నిలిచింది. కర్ణాటక స్టేట్‌ లాన్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌ కోర్టులో జరిగిన ఈ టోర్నీ డబుల్స్‌ ఫైనల్లో టాప్‌ సీడ్‌ విష్ణువర్ధన్‌– శ్రీరామ్‌ బాలాజీ ద్వయం 6–2, 4–6, 6–10తో రెండో సీడ్‌ ‘సూద్‌’ బ్రదర్స్‌ చంద్రిల్‌– లక్షిత్‌ (భారత్‌) జంట చేతిలో ఓటమి పాలైంది. మరోవైపు సింగిల్స్‌ సెమీస్‌ మ్యాచ్‌ల్లో ప్రజ్నేశ్‌ గున్నేశ్వరన్‌ 6–4, 6–4తో సామి రెన్‌వెన్‌ (జర్మనీ)పై, శ్రీరామ్‌ బాలాజీ 4–6, 6–3, 7–5తో కరుణుదయ్‌ సింగ్‌పై గెలుపొంది ఫైనల్‌కు చేరుకున్నారు.  

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement