విష్ణు ఖాతాలో 18వ డబుల్స్ టైటిల్ | Vishnu Vardhan's long wait for title continues | Sakshi
Sakshi News home page

విష్ణు ఖాతాలో 18వ డబుల్స్ టైటిల్

Mar 15 2014 1:07 AM | Updated on Aug 18 2018 4:18 PM

ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ ప్లేయర్ విష్ణువర్ధన్ తన కెరీర్‌లో 18వ అంతర్జాతీయ డబుల్స్ టైటిల్‌ను సాధిం చాడు.

చెన్నై: ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ ప్లేయర్ విష్ణువర్ధన్ తన కెరీర్‌లో 18వ అంతర్జాతీయ డబుల్స్ టైటిల్‌ను సాధిం చాడు. శుక్రవారం ఇక్కడ జరిగిన ఐటీఎఫ్ ఇండియా ఫ్యూచర్స్-3 టోర్నీలో తన భాగస్వామి జీవన్ (భారత్)తో కలిసి విష్ణు విజేతగా నిలిచాడు. ఫైనల్లో రెండో సీడ్ విష్ణు-జీవన్ ద్వయం 7-6 (7/1), 6-3తో టాప్ సీడ్ శ్రీరామ్ బాలాజీ-రంజిత్ (భారత్) జోడిపై విజయం సాధించింది.
 
 తొలి సెట్‌లో రెండు జంటలు తమ సర్వీస్‌లను నిలబెట్టుకోవడంతో టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్‌లో విష్ణు జంట పైచేయి సాధిచింది. రెండో సెట్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ను ఒకసారి బ్రేక్ చేసిన విష్ణు ద్వయం అదే జోరులో విజయాన్ని ఖాయం చేసుకుంది. గతేడాది ఆగస్టులో గాబోన్ టోర్నీలో జీవన్‌తోనే కలిసి డబుల్స్ టైటిల్ నెగ్గిన విష్ణు ఆ తర్వాత మరో టైటిల్‌ను తన ఖాతాలో వేసుకోలేదు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement